దొమ్మేరు హైవేపై కూలీలకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

1843చూసినవారు
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు హైవేపై బుధవారం ఉదయం 11 మంది కూలీలతో కొవ్వూరు వైపు వెళ్తున్న బొలెరో వాహనం, ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి డివైడర్పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కూలీలు స్వల్ప గాయాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదాన్ని గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి, వారికి సహాయం అందించారు.

సంబంధిత పోస్ట్