ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

1527చూసినవారు
ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే
తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో తుఫాన్ ప్రభావంతో నీటమునిగిన వరి చేలు, పంట పొలాలు, కాలువలను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సోమవారం పరిశీలించారు. కూటమి నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత అధికారులతో కలిసి ఆయన పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. రైతులకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని, నీటి ప్రవాహం, మురుగు నీటి తొలగింపు, నిలిచిన నీటిని బయటకు పంపించే చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్