కాకినాడలో కుమార్తెలను డిగ్రీ చదువుల కోసం చేర్పించి, తిరుగు ప్రయాణంలో వీరవల్లి టోల్ ప్లాజా వద్ద లారీ ఢీకొనడంతో తూ.గో జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన పిరికిన చెంచయ్య (45) అనే వ్యక్తి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోపాలపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య దుర్గ, కుమార్తెలు భవానీ, శాంతి ఉండగా చేపలు, రొయ్యలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.