జన సైనికుడి కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కు అందజేత

151చూసినవారు
జన సైనికుడి కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కు అందజేత
కొవ్వూరు టౌన్ 19వ వార్డుకు చెందిన జన సైనికుడు పత్తి గుల్ల నాగరాజు ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారు. వారి కుటుంబాన్ని జనసేన కొవ్వూరు మండల అధ్యక్షులు, కాపవరం సొసైటీ చైర్మన్ సుంకర సత్తిబాబు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి సోమవారం తీసుకెళ్లారు. అక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్సీ, పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ చేతుల మీదుగా వారి కుటుంబానికి రూ.5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేశారు.

సంబంధిత పోస్ట్