'సర్దార్ పాపన్న గౌడ్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి'

662చూసినవారు
కొవ్వూరులో గురువారం సర్దార్ పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు మార్గాని నాగేశ్వరరావు, బీసీ సోదరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్దార్ పాపన్న గౌడ్ సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన ధీరుడని, ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్