ప్రశాంతంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు

18చూసినవారు
ప్రశాంతంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు
తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు డివిజన్ పరిధిలోని చాగల్లు మండలంలో మంగళవారం 30  ప్రాథమిక, ఒక ప్రాథమికోన్నత, 7 ఉన్నత పాఠశాలలకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. MEO1 ఎం. జె. సత్యానంద్, MEO2 సి. హెచ్. సుభాకర్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని వారు పర్యవేక్షణ అనంతరం తెలిపారు. కొవ్వూరు డివిజన్ నుండి DyEO, తులసిదాస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చాగల్లును సందర్శించారు. నూతనంగా ఎన్నికైన SMC సభ్యులకు DyEO, MEOలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కమిటీ రెండేళ్ల పాటు కొనసాగుతుందని, పాఠశాల పురోగతికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్