కొవ్వూరులో జనసేన మహిళా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

8చూసినవారు
కొవ్వూరులో జనసేన మహిళా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలోని అచ్చియమ్మ కాలనీ శ్రీ గణపతి ఆలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ కొవ్వూరు పట్టణ మహిళా అధ్యక్షురాలు కె. నవ్య ఆధ్వర్యంలో వీర మహిళలు పాల్గొని, పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని ప్రసాదించాలని కోరుతూ ఆలయంలో ప్రత్యేక పూజలు, పంచామృతాలతో మహాభిషేకాలు నిర్వహించారు. నవ్య మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ సినీ ప్రస్థానం నుంచి రాజకీయ రంగ ప్రవేశం వరకు సాగిన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆయన సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్