కొవ్వూరులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం..!

628చూసినవారు
కొవ్వూరులోని ఇందిరమ్మ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ప్లాస్టిక్ బాటిల్స్, ఇతర వ్యర్థాలు పేరుకుపోవడంతో డ్రైనేజీలు పూడిపోయాయి. దీనివల్ల కాలనీల్లో దుర్వాసన వెదజల్లుతోందని, నీరు ప్రవహించడానికి ఆటంకం ఏర్పడిందని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, డ్రైనేజీలలో పేరుకున్న వ్యర్థాలను తొలగించి, సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్