కొవ్వూరు మండలం కాపవరం పంచాయతీ గోవర్ధనగిరిమెట్టలో శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఆయన కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ TV రామారావుతో పాటు పలువురు పాల్గొన్నారు.