పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 'మన ఇల్లు - మన గౌరవం' సామూహిక గృహప్రవేశాలు కొవ్వూరు మండలం దొమ్మేరులో హౌసింగ్ లే అవుట్ వద్ద జరిగాయి. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొని, చెవ్వూరి నాగలక్ష్మి నూతన గృహాన్ని ప్రారంభించారు. ప్రతి కుటుంబానికి సొంత ఇంటితో పాటు సామాజిక గౌరవాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.