చాగల్లులో రూ. 66 వేలకు లడ్డూను దక్కించుకున్న తోట రామకృష్ణ

2248చూసినవారు
చాగల్లులో రూ. 66 వేలకు లడ్డూను దక్కించుకున్న తోట రామకృష్ణ
చాగల్లు మండలం చాగల్లులో తెలగ కాపు సంఘం దర్శకుడు వి. వి వినాయక్ సోదరుడు సురేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాల్లో వైసిపి రాష్ట్ర కార్యదర్శి తోట రామకృష్ణ పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి పేరు మీద వినాయక లడ్డు వేలంపాటలో పాల్గొని రూ. 66, వేలకు స్వామివారి లడ్డూను ఆయన దక్కించుకున్నారు. ఈ సందర్భంగా వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా తలారి వెంకట్రావు విజయం సాధించాలని ప్రత్యేక పూజలు చేశారు. రాబోయేది కార్యకర్తల ప్రభుత్వమని, ప్రతి ఒక్కరికీ తగిన న్యాయం జరుగుతుందని తోట రామకృష్ణ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్