రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వరుస ఘటనలు ఆందోళనకరమని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల సుధాకర్ విమర్శించారు. మండపేటలో మంగళవారం మాట్లాడుతూ, ఆకివీడు, పెదపేట కాలనీలో జరిగిన ఘర్షణలు ప్రభుత్వ వైఫల్యమేనని, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు అనుచరులతో వెళ్లి స్థానిక దళితులను రెచ్చగొట్టడం అనుచితమని పేర్కొన్నారు. ఈ ఘటనపై హై లెవల్ జ్యుడీషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.