క్యాన్సర్ పై అవగాహన: అంగరలో ర్యాలీ, సదస్సులు

442చూసినవారు
క్యాన్సర్ పై అవగాహన: అంగరలో ర్యాలీ, సదస్సులు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోనసీమ, మండపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంగరలో డాక్టర్ పి.ఎన్.ఎస్.డి. రత్నకుమారి ఆధ్వర్యంలో ర్యాలీ, అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ రత్నకుమారి మాట్లాడుతూ, అపోహలు వీడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ప్రారంభ దశలోనే గుర్తిస్తే 90% క్యాన్సర్లను నయం చేయవచ్చని తెలిపారు. పీచు పదార్థాలు తినడం, వ్యాయామం చేయడం, సరైన జీవనశైలి పాటించడం ద్వారా వ్యాధి ముప్పు తగ్గుతుందని, శరీరంలో గడ్డలు, మచ్చలు, దీర్ఘకాలిక మార్పులు కనిపిస్తే వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్