మండపేట మండల ప్రభుత్వ హైస్కూల్ హెచ్ఎంలు, టీచర్లతో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. టెన్త్ ఫలితాల్లో వెనుకబాటుపై ఆరా తీస్తూ, స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్ల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచాలని పిలుపునిచ్చారు. 98%
ఫలితాలు సాధించిన ద్వారపూడి గర్ల్స్ హైస్కూల్ సిబ్బందిని అభినందించారు. సింగపూర్ విద్యా పర్యటన ముగించుకున్న ఆ స్కూల్ హెచ్ఎం రాజరాజేశ్వరి అక్కడి ఉత్తమ బోధనా పద్ధతులను వివరించారు.