మండపేట: విమాన ప్రమాదంపై లీలా కృష్ణ దిగ్భ్రాంతి

82చూసినవారు
మండపేట: విమాన ప్రమాదంపై లీలా కృష్ణ దిగ్భ్రాంతి
లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాద ఘటన ద్రిగ్భాంతికి గురిచేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రమాదంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విమానంలో మొత్తం 242 మంది మృతి చెందటంతో పాటు విమానం కూలి మెడికల్ కళాశాల విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్