ఎన్నికల హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను వెన్నుపోటు పొడిచారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్రస్థాయిలో విమర్శించారు.
వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం మండపేటలో భారీ నిరసన బైక్ ర్యాలీ నిర్వహించారు. గత ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాల పేరుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో ప్రతి ఇంటికీ పంపిన ప్రామిసరీ బాండ్ల కాపీలను, మ్యానిఫెస్టోను ప్రదర్శిస్తూ పార్టీ శ్రేణులు ఈ వినూత్న నిరసన చేపట్టాయి. కూటమి ప్రభుత్వం బూటకపు హామీలతో ప్రజలను దగా చేసిందని, ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చే వరకు వైకాపా తరఫున ప్రజాపోరాటాలు కొనసాగిస్తామని తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు.