వైజాగ్ వెళ్లిన మండపేట పెయింటర్ అదృశ్యం

916చూసినవారు
వైజాగ్ వెళ్లిన మండపేట పెయింటర్ అదృశ్యం
మండపేటకు చెందిన పెయింటర్ సాదే రాజశేఖర్ (40) గత కొన్ని నెలలుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పని నిమిత్తం విశాఖపట్నం వెళ్లిన ఆయన అప్పటి నుండి ఇంటికి తిరిగి రాలేదు, మొబైల్ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉంది. 5.5 అడుగుల ఎత్తు ఉండే రాజశేఖర్ ఆచూకీ కోసం బంధువులు గాలించినా ఫలితం లేకపోవడంతో మండపేట టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన సమాచారం తెలిసిన వారు 9963913999 లేదా 7075584444 నంబర్లకు తెలియజేయాలని సోమవారం కోరారు.

సంబంధిత పోస్ట్