మండపేట: ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ

412చూసినవారు
మండపేట ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ జరిగింది. మండలంలో రూ. 6. 21 కోట్ల విలువైన 1877 పనులను అధికారులు ఆడిట్ చేయగా, కొలతల్లో లోపాలు బయటపడ్డాయి. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నట్లు పీడీ మధుసూదన్, ఎంపీడీవో సత్యనారాయణ తెలిపారు. పారదర్శకత లోపించిన పనులపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్