వల్లూరులో భారీ దొంగతనం: 2 లక్షల విలువైన ఆభరణాల అపహరణ

162చూసినవారు
వల్లూరులో భారీ దొంగతనం: 2 లక్షల విలువైన ఆభరణాల అపహరణ
కపిలేశ్వరపురం మండలం వల్లూరులో గణేశ్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి అన్నవరం వెళ్లిన సమయంలో ఈ భారీ దొంగతనం జరిగింది. ఇంటి వెనుక తలుపులు పగులగొట్టిన దుండగులు రూ. 2.07 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో శనివారం డీఎస్పీ విద్య ఘటనా స్థలాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. అంగర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్