మండపేట మండలం కేశవరంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. మంగళవారం, కేశవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఉండమట్ల నాగ తులసి, మూడవ వార్డు మెంబర్ హరే రామకృష్ణలు, ఉండమట్ల తాతాజీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జోగేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ చేరికలతో కేశవరంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది.