అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు

470చూసినవారు
అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు
కోనసీమ, మండపేటలోని అంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం డా. జె. అనూజ ప్రియాంక ఆధ్వర్యంలో 25 మంది గర్భిణీ స్త్రీలకు ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి, మందులు ఉచితంగా అందజేశారు. ఇద్దరు హైరిస్క్ గర్భిణీలను గుర్తించి, కపిలేశ్వరపురం సిహెచ్సికి రిఫర్ చేశారు. డాక్టర్లు గర్భిణీల ఎర్లీ నమోదు, రెగ్యులర్ చెకప్, పోషకాహారం, టీకాలు, ప్రసవ ప్రణాళిక గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్