ఆటో చోరీ కేసులో నిందితుడు మొలగల వెంకటేశ్వరరావుకు ఆలమూరు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించింది. రూరల్ సీఐ దొరరాజు తెలిపిన వివరాల ప్రకారం, తాడేపల్లిగూడెం వాసి వెంకటేశ్వరరావు జెడ్. మేడపాడుకు చెందిన బీమన వెంకటరమణ ఆటోను దొంగిలించాడు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఐ. ప్రవీణ్ కుమార్ ఈ తీర్పు వెలువరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.