మండపేట పట్టణంలోని బస్టాండ్ సమీపంలో జరిగిన పెంతెకోస్తు క్రైస్తవ సభలకు హాజరైన సుమారు 55 ఏళ్ల గుర్తుతెలియని మహిళ గుండెపోటుతో మృతి చెందారు. ఆమె మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో సంప్రదించి సమాచారం అందించాలని సీఐ సురేష్ శనివారం కోరారు. ఆమె వివరాలు తెలియాల్సి ఉంది.