వడ్లమూరులో జీఎస్ ఎంటర్టైన్మెంట్ వారి 'ప్రొడక్షన్ నంబర్ 1' చిత్రం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. నిర్మాత గుత్తుల గోవిందరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరై, తొలి షాట్‌కు క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. దర్శకుడు గుత్తుల వెంకట్ పర్యవేక్షణలో హీరో వినయ్ రెడ్డి, ఇద్దరు హీరోయిన్లతో ఈ సినిమా తెరకెక్కనుంది. చిత్ర యూనిట్ త్వరగా షూటింగ్ పూర్తి చేసుకుని విజయం సాధించాలని మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.