దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం: మండపేటలో ఎమ్మెల్సీ ఆగ్రహం

584చూసినవారు
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్రంగా ఖండించారు. మండపేటలో ఆదివారం ఆయన మాట్లాడుతూ, ఈ దాడిని కాపు సామాజికవర్గంపై దాడిగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, 'రెడ్ బుక్' రాజ్యాంగంతో వైసీపీ నేతలపై అక్రమ కేసులు, దాడులకు దిగుతోందని ఆయన మండిపడ్డారు. లడ్డూ ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రశ్నించే వారిని భయపెడుతున్నారని, అధికారం ఎల్లప్పుడూ శాశ్వతం కాదని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించాలని హితవు పలికారు.

సంబంధిత పోస్ట్