
గచ్చకాయలపొర గ్రామంలో పర్యటించిన ఎంపీ హరీష్ బాలయోగి
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి, స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు మంగళవారం డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గచ్చకాయలపొర గ్రామంలో పర్యటించారు. తీర ప్రాంతం కావడంతో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు గ్రామస్తులకు సూచించారు. ముందస్తు చర్యల కోసం అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం సిద్ధం చేసి, అవసరమైన ఏర్పాట్లు చేసిందని తెలిపారు.






































