విజయవాడ రైల్వేస్టేషన్‌లో మంగళవారం గుట్కా విక్రయాల వివాదం చివరకు హత్యకు దారితీసింది. ప్లాట్‌ఫారమ్ 7-8 మధ్య కాట్రేనికోనకు చెందిన సాయి (30) అనే వ్యక్తిని, అతని స్నేహితుడు నరగడ రాము మద్యం మత్తులో బీర్ సీసాతో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ప్రయాణికుల రద్దీ మధ్య జరిగిన ఈ ఘటనతో అందరూ భయాందోళనలకు గురై పరుగులు తీశారు. రైల్వే పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.