డ్రైవర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై రాజమండ్రి కోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. తదుపరి విచారణను కోర్టు మే 6వ తేదీకి వాయిదా వేసింది. సాక్షులను బెదిరించిన కేసులో ఆయనను కస్టడీకి ఇవ్వాలని సర్పవరం పోలీసులు కోరగా, ఆ పిటిషన్‌ను కాకినాడ కోర్టులోనే వేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. మరోవైపు, ఇదే కేసులో బెయిల్ దరఖాస్తుపై విచారణను ఎల్లుండికి వాయిదా వేశారు.