పాత ఇంజరం గోదావరి పాయలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

241చూసినవారు
పాత ఇంజరం గోదావరి పాయలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ఐ. పోలవరం మండలం పాత ఇంజరం గోదావరి పాయలో బుధవారం సుమారు 40-45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. 5.5 అడుగుల ఎత్తు, చామనఛాయ రంగుతో, తెల్లటి చుక్కల చొక్కా, నీలం జీన్స్ ధరించినట్లు పోలీసులు తెలిపారు. వీఆర్వో ఫిర్యాదుతో ఐ. పోలవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గుర్తింపు కోసం అమలాపురం ఏరియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.

సంబంధిత పోస్ట్