కాట్రేనికోన మండలం పల్లంకుర్రులో స్వర్ణకుమారి (22) అనే వివాహిత వివాహమైన ఏడాదికే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి కొండపూడి దనకాసులు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, తన కుమార్తె మృతికి అల్లుడు ధనుంజయ్, అతని బంధువుల వేధింపులే కారణమని ఆరోపించారు. భర్తకు వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో బంధువులు ఆమెను మానసికంగా వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించారని పేర్కొన్నారు. ఎస్సై అవినాష్ కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు బుధవారం వెల్లడించారు.