ముమ్మిడివరం నియోజకవర్గం చొల్లంగిపేటలో చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్ పథకం ఉత్తర్వులను ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు బుధవారం పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గవ్యాప్తంగా సుమారు 290 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతుందని, ఇది వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన తెలిపారు. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.