చెయ్యేరులో ఆలయ నిర్మాణంపై వివాదం.. ఇరువర్గాల మధ్య ఘర్షణ

1185చూసినవారు
కాట్రేనికోన మండలం చెయ్యేరు అగ్రహారంలో కనకదుర్గమ్మ ఆలయ నిర్మాణం విషయంలో ఆదివారం రెండు గ్రామాల మధ్య వివాదం చెలరేగింది. పాత ఆలయం ఉన్న చోటే కొత్తది నిర్మించాలని గ్రామస్థులు కోరుతుండగా, అది తన పట్టా భూమి అని ఓ రైతు అభ్యంతరం వ్యక్తం చేసి గ్రావెల్ పోయించాడు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, స్థానిక నాయకులు జోక్యం చేసుకుని, శాంతి కమిటీ ద్వారా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. పోలీసుల హామీతో నిరసనకారులు ఆందోళన విరమించారు.

సంబంధిత పోస్ట్