ముమ్మిడివరం సామాజిక ఆసుపత్రిలో రోగులు తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ, రెండు ఆర్వో ప్లాంట్లు ఉన్నా ప్రయోజనం లేకపోయింది. పాత ప్లాంట్ శిథిలావస్థలో ఉండగా, కొత్తగా ఏర్పాటు చేసిన ప్లాంట్ పనిచేయడం లేదు. దీంతో రోగులు, వారి సహాయకులు వేడి గాలులు, ఉక్కపోతతో పాటు తాగునీరు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు గురువారం కోరారు.