ఠానేలంకలో రేవు భూముల ఆక్రమణ: మత్స్యకారుల భారీ నిరసన

636చూసినవారు
లంకాఫ్ ఠానేలంకలో మత్స్యకారుల రేవు భూములను కొందరు వ్యక్తులు ఆక్రమించి ఆక్వా చెరువులుగా మార్చారని గ్రామస్థులు ఆరోపించారు. దీనిని ప్రశ్నిస్తే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని బాధితులు తెలిపారు. తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్న ఆక్రమణదారులపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ, మహిళలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టి, అక్రమ చెరువులను తక్షణమే తొలగించాలని గురువారం డిమాండ్ చేశారు. న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్