సావిత్రినగర్ లో అగ్నిప్రమాదం.. రూ. 4 లక్షల ఎండుచేపలు దగ్ధం

136చూసినవారు
సావిత్రినగర్ లో అగ్నిప్రమాదం.. రూ. 4 లక్షల ఎండుచేపలు దగ్ధం
యానాం పరిధిలోని సావిత్రినగర్ లో చేపలు ఎండబెట్టే ప్రదేశంలో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు తాటాకు పాకలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మల్లాడి అప్పాయమ్మ, ఓలేటి బాబి, మేడా ధనలక్ష్మిలకు చెందిన సుమారు రూ. 4 లక్షల విలువైన ఎండుచేపలు బూడిదయ్యాయి. యానాం నుండి అగ్నిమాపక వాహనం చేరుకునే లోపే ఈ ఆస్తి నష్టం జరిగింది. యానాం మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దడాల గొంతెయ్య ఘటనా స్థలాన్ని సందర్శించి నష్టాన్ని పరిశీలించారు. బాధితులు తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్