ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్య పదజాలంతో విమర్శలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ నాయకులు శనివారం ఐ. పోలవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి మాట్లాడుతూ, అంబటిని వెంటనే అరెస్ట్ చేయాలని, సీఎంకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు అంబటి వైఖరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.