ఐ. పోలవరం మండలం బాణాపురంలో మైనర్ బాలికను లైంగికంగా వేధించిన వ్యక్తిపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అమలాపురం డీఎస్పీ ప్రసాద్ శుక్రవారం బాణాపురంలో బాలిక ఇంటివద్ద విచారణ చేపట్టారు. అనంతరం నిందితుడిని రిమాండ్ కు తరలిస్తామని పోలీసులు తెలిపారు.