ఓడిపోతే గుండు కొట్టించుకుంటా: యానాంలో మల్లాడి సంచలన సవాల్

247చూసినవారు
యానాంలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఎన్డీయే కూటమి (NR కాంగ్రెస్) అభ్యర్థి మల్లాడి కృష్ణారావు, సోమవారం దరియాలతిప్పలో ప్రచారం చేస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్‌కు బహిరంగ సవాల్ విసిరారు. గొల్లపల్లిని ఓడించకపోతే గుండు కొట్టించుకుని, పేరు మార్చుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 9న ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో యానాం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్