కోనసీమ: రోడ్డు ప్రమాదాల నివారణకు 'స్టాప్, వాష్ అండ్ గో'

1326చూసినవారు
కోనసీమ: రోడ్డు ప్రమాదాల నివారణకు 'స్టాప్, వాష్ అండ్ గో'
కోనసీమలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు పోలీసులు 'స్టాప్, వాష్ అండ్ గో' కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి, తెల్లవారుజామున ప్రయాణించే డ్రైవర్లు నిద్రమత్తు వల్ల ప్రమాదాలకు గురికాకుండా నివారించడమే దీని లక్ష్యం. హైవేలపై వాహనాలను ఆపి, డ్రైవర్లతో ముఖం కడిగించి, వారు అప్రమత్తమైన తర్వాతే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. ప్రతి ప్రాణం విలువైనదని, డ్రైవర్లు పోలీసులకు సహకరించాలని ఎస్పీ బుధవారం కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్