పేరుపాలెం బీచ్‌లో స్నానానికి దిగి కోనసీమ విద్యార్థి గల్లంతు

2549చూసినవారు
పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్‌లో ఆదివారం ఒక విద్యార్థి సముద్రంలో స్నానానికి దిగి గల్లంతయ్యాడు. డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మురముళ్లకు చెందిన సుభాష్, రాజమండ్రిలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. బీచ్‌లో స్నానం చేస్తుండగా అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోయినట్లు సమాచారం. పోలీసులు, స్థానిక మత్స్యకారులు గల్లంతైన విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్