కోనసీమలో సందడి చేస్తున్న మల్లికాసులు

2131చూసినవారు
సంక్రాంతి పండుగ సందర్భంగా కోనసీమలో మల్లికాసుల వారికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సంప్రదాయ ప్రాధాన్యత ఉంది. గ్రామీణ సంస్కృతిలో భాగమైన ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. కోనసీమ వాసుల నమ్మకం ప్రకారం, మల్లికాసుల వారు అడుగుపెట్టిన ఇంటికి, గ్రామానికి శుభాలు కలుగుతాయి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్య కాలంలో వారు ఇచ్చే ఆశీర్వాదం వల్ల పంటలు బాగా పండి, కుటుంబాలు సుఖసంతోషాలతో ఉంటాయని విశ్వసిస్తారు.

సంబంధిత పోస్ట్