కాట్రేనికోన మండలం పల్లంకుర్రు పంచాయతీ పరిధిలోని తమ్మాయి చెరువుకు చెందిన స్వర్ణకుమారి(22) మంగళవారం రాత్రి తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. వేమవరం గ్రామానికి చెందిన ఈమెకు పల్లంకుర్రుకు చెందిన దాసరి ధనుంజయ్‌తో వివాహం కాగా, ప్రస్తుతం ఆయన ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉంటున్నారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై అవినాశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.