ముమ్మిడివరంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ నేతృత్వంలో
వైసీపీ శ్రేణులు శుక్రవారం "వెన్నుపోటుకు రెండేళ్లు" పేరుతో నిరసన బైక్ ర్యాలీ నిర్వహించాయి. ఎయిమ్స్ కాలేజీ నుండి లాంప్ కాలేజీ వరకు జరిగిన ఈ ర్యాలీలో పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పొన్నాడ సతీష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం బూటకపు హామీలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన 143 హామీలను తక్షణమే నెరవేర్చాలని, లేదంటే ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. వైఎస్
జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.