ముమ్మిడివరం: ఈ మలుపు.. ప్రమాదాలకు పిలుపు

703చూసినవారు
ముమ్మిడివరం: ఈ మలుపు.. ప్రమాదాలకు పిలుపు
ముమ్మిడివరం మండలం అయినాపురం నుంచి కాట్రేనికోన వెళ్లే ఆర్ అండ్ బీ రహదారిపై చర్చి సమీపంలో ఉన్న మలుపు వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా కాలువలు ఉండటంతో భారీ వాహనాలు వచ్చినప్పుడు పక్కకు తప్పుకోవడానికి వీలులేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రమాదకర మలుపు వద్ద తక్షణమే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలని స్థానికులు, వాహనదారులు అధికారులను కోరుతున్నారు. ఈ మలుపు వద్ద తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్