ఓల్డ్ అయినాపురం: డ్రైన్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

216చూసినవారు
కాట్రేనికోనలోని ఓల్డ్ అయినాపురం డ్రైన్‌లో గురువారం ఒక గుర్తుతెలియని పురుషుడి మృతదేహం కొట్టుకొచ్చింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు స్థానిక కుమ్మరి వీధికి చెందినవాడని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్