ఓటు వేసే వారికి వేతనంతో కూడిన శెలవు: కోనసీమ కలెక్టర్

205చూసినవారు
ఓటు వేసే వారికి వేతనంతో కూడిన శెలవు: కోనసీమ కలెక్టర్
పుదుచ్చేరి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు పాల్గొనేందుకు వీలుగా, కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ మంగళవారం వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ నెల 9, 23 తేదీల్లో జరగనున్న ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల ఓటర్లకు ఈ సౌకర్యం కల్పించాలని, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఇది వర్తిస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం బాధ్యత అని, సెలవు నిరాకరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల ఓటర్లు తమ కార్యాలయాల్లో సమాచారం అందించి ఈ సెలవు పొందవచ్చని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్