కాట్రేనికోనలో చోరీ ప్రయత్నం

1117చూసినవారు
కాట్రేనికోన మండల కేంద్రంలో సోమవారం రాత్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వెనుక భాగంలో నాని అనే వ్యక్తి కొత్త ఇంట్లో దొంగతనం ప్రయత్నం జరిగింది. గుర్తుతెలియని దుండగులు తాళం బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించే క్రమంలో అలికిడి కావడంతో భయపడి ఏమీ తీసుకెళ్లకుండా పరారైనట్లు గ్రామస్థులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొత్త ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటున్న దొంగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు వెలువడ్డాయి.

సంబంధిత పోస్ట్