ఉపాధి పనుల్లో నిబంధనలు పాటించాలి.. ఎంపీడీవో

398చూసినవారు
కాట్రేనికోన ఎంపీడీవో రాజేశ్వరరావు గురువారం మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మస్టర్లను పరిశీలించి, కూలీల హాజరును క్షేత్రస్థాయిలో సరిచూశారు. పని ప్రదేశంలోనే ఫోటోలు అప్‌లోడ్ చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఫీల్డ్ అసిస్టెంట్లను హెచ్చరించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పని ప్రదేశంలో తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి పనుల్లో పారదర్శకత పాటించాలని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్