మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, హైటెక్ సిటీలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉండ్రు సతీశ్ (31) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రెడ్డి కాలనీలో నివాసముంటున్న సతీశ్, భార్య పుట్టింటికి వెళ్లడంతో తమ్ముడితో కలిసి ఉంటున్నాడు. తలుపు తీయకపోవడంతో గదిలోకి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. ఉద్యోగంలో పని ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.