చెయ్యారులో వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం

355చూసినవారు
కాట్రేనికోన మండలం చెయ్యారు గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం భీష్మ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్వామివారి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉభయ దేవేరులతో కొలువుదీరిన స్వామివారిని కీర్తిస్తూ ఆలపించిన ఆధ్యాత్మిక గీతాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. ఆలయ కమిటీ సభ్యులు చేసిన ఏర్పాట్లతో వేడుకలు ఘనంగా ముగిశాయి.

సంబంధిత పోస్ట్